: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన, తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. రాష్ట్రాభివృద్ధిలో భాగమయ్యేందుకు, నియోజకవర్గాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తాను పార్టీ మారుతున్నానని ఆయన చెప్పారు. చంద్రబాబునాయుడి నాయకత్వంలో పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు పార్టీ మారినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిలో భాగమయ్యే అందరినీ కలుపుకునిపోతామని అన్నారు. అశోక్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందించారు.