: మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి సచిన్ హామీ
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమానికి సచిన్ ను అంబాసిడర్ గా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరగా, అందుకు ఆయన అంగీకరించారు. కాగా, కేరళ యువకులు క్రీడా సాధన చేసేందుకుగాను ఫుట్ బాల్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం పినరయి విజయన్ ను కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్ (కేబీఎఫ్ సీ)ను స్థాపించిన సచిన్ టెండూల్కర్ కోరగా, ఆయన అందుకు సానుకూలంగా స్పందించారు. పినరయి విజయన్ ను కలిసిన వారిలో కేబీఎఫ్ లో సహ యజమానులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఉన్నారు.