: తనదైన శైలిలో తలపాగా చుట్టుకున్న కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్
కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ తలపాగా చుట్టడంలో తనదైన శైలిని చూపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రి సొంత రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి పంచాయతీరాజ్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో ఆయన్ని కలిసింది. ఈ సందర్భంగా రాజ్యవర్థన్ సింగ్ కు పూల బొకేలు, స్వీట్లు అందించిన ప్రతినిధులు తమ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం తలపాగా వస్త్రాలను కూడా మంత్రికి అందించారు. ఒక తలపాగాను మంత్రి తలపై అమర్చేందుకు ప్రతినిధుల బృందం సిద్ధమవుతుండగా... రాజ్యవర్థన్ సింగ్ తనకు తానుగా ఆ వస్త్రాన్ని తీసుకుని తలపాగా చుట్టుకున్నారు. దీంతో, సంతోషపడిన సభ్యులు మరిన్ని తలపాగా వస్త్రాలను ఆయనకు అందించారు.