: కృష్ణా జలాలలో మా వాటా తేలకుండా నిర్ణయం తీసుకోకండి... కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ


కృష్ణానదీ జలాల విషయమై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఒక లేఖ రాశారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేలకుండా ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవద్దని, రాష్ట్ర వాటా కోసం ఇప్పటికే ట్రైబ్యునల్ ను ఆశ్రయించామని, ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణా యాజమాన్య బోర్డు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయవద్దని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ముసాయిదా నోటిఫికేషన్ లేదని, ఈ పరిస్థితిలో నోటిఫికేషన్ విడుదల చేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News