: మేఘాలయ కాంగ్రెస్ చేజారుతోందా?


కాంగ్రెస్ ముక్తభారత్ నినాదంతో దూసుకుపోతున్న బీజేపీ, తాజాగా మేఘాలయలో అధికారం చేపట్టే దిశగా పావులు కదుపుతోంది. దేశంలో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పైనున్న వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకుని అసోం వంటి రాష్ట్రాల్లో పాగావేసిన సంగతి తెలిసిందే. తాజాగా మేఘాలయ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న లుకలుకలను ఆధారం చేసుకుని, ఆ రాష్ట్రంలో పాగావేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ అసంతృప్తులతో బీజేపీ సీనియర్ నేత హేమంత బిశ్వాస్, రామ్ మాధవ్ చర్చలు జరిపినట్టు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదులు అందాయి. షిల్లాంగ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ క్యాంపు సమావేశంలో ఇద్దరు మంత్రులను తమవైపు మొగ్గేలా చేసుకున్నారని కాంగీయులు పేర్కొన్నారు. మేఘాలయలోని గరో, ఖాసీ తెగల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని వారు అధిష్ఠానానికి తెలిపారు. మేఘాలయ అసెంబ్లీలో స్వల్ప మెజారిటీ ఉండడంతో ఉత్తరాఖండ్ వ్యవహారం లాంటిది అక్కడ కూడా చోటుచేసుకునే అవకాశం ఉందని వారు అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News