: మా వెంట పడకండి... మాకు ప్రైవసీ కావాలి: ఫొటో గ్రాఫర్ తో హీరో సంజయ్ దత్


హాలీవుడ్ చిత్రం ‘రాంబో’ రీమేక్ గా హిందీలో తెరకెక్కిస్తున్న మూవీలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ‘రాంబో‘లో సిల్వెస్టర్ స్టాలోన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నాడు. ఈ రీమేక్ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ముంబయ్ లోని ‘పాలీ హిల్స్’ లోని తన గ్రౌండ్ ఫ్లోర్ లో సంజయ్ దత్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా సంజయ్ దత్ బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి ఉన్న ఒక పోజ్ ను ఒక ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. దీంతో, సంజయ్ చికాకు పడ్డాడు. ‘సినీ ఇండస్ట్రీ వ్యక్తులకు కాస్త ప్రైవసీ కావాలని, తమ వెంట పడవద్దని’ మీడియాతో మున్నాభాయ్ అన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News