: మూడు కెమెరాలతో వచ్చిన ఎల్జీ సరికొత్త స్మార్ట్ ఫోన్


స్మార్ట్ ఫోన్లకు ముందొకటి, వెనకొకటి కెమెరాలు ఉండే రోజులు పోయాయి. తాజాగా మూడు కెమెరాలతో ఉండే సరికొత్త హైఎండ్ స్మార్ట్ ఫోన్ ను ఎల్జీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7, ఐఫోన్ 6ఎస్ లతో పోటీ పడేలా తయారు చేసిన దీని ధర రూ. 52,990 అని, ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని ఎల్జీ వివరించింది. ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 5.3 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 2 టెర్రాబైట్ల వరకూ విస్తరించుకునే సామర్థ్యం ఉన్నాయి. వెనుకవైపున 16, 8 ఎంపీ కెమెరాలుండగా, మరో 8 ఎంపీ కెమెరా ముందు భాగంలో ఉంది. 2,800 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఫోన్ బరువు 159 గ్రాములని సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News