: తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తే అందరం నష్టపోతాం: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య వ‌స్తోన్న విభేదాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తే అందరం నష్టపోతామ‌ని అన్నారు. ఈరోజు ఓ టీవీ ఛాన‌ల్‌కి వ‌చ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాల మ‌ధ్య మంచి వాతావ‌ర‌ణం కొన‌సాగాల‌ని అన్నారు. ఇక్క‌డ సాధ్యం కాని స‌మ‌స్య‌ను కేంద్రం ప‌రిష్క‌రించాలని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను కేంద్రం ఉదారంగా పరిష్కరించాలని పేర్కొన్నారు. త‌లెత్తుతోన్న‌ సమస్యలను ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News