: ‘సుల్తాన్‌’ పాట‌కు 24 గంటల్లో.. 16 లక్షలు దాటేసిన‌ వ్యూస్


బాలీవుడ్ లో విడుదలకు సిద్ధమవుతోన్న ‘సుల్తాన్’ లోని ‘బేబీ కో బాస్ ప‌సంద్ హై’ పాట‌ను సినిమా యూనిట్ నిన్న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. యూ ట్యూబ్ లో ఈ పాట‌ ఇప్ప‌టికి 16 లక్ష‌లకు పైగా వ్యూస్‌ని పొందింది. పాట‌లో సల్మాన్‌ ఖాన్‌, అనుష్క శర్మ వేసిన స్టెప్పులు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. విశాల్‌-శేఖర్ సుల్తాన్ సినిమాకు సంగీతం స‌మ‌కూర్చారు. ఈ పాట‌కు గాయ‌కులు విశాల్ ద‌డ్లాని, షాల్మాలీ ఖోల‌డే, ఇషిత త‌మ గాత్రాన్ని అందించారు. ఇర్‌షాద్ క‌మిల్ ఈ గేయాన్ని ర‌చించారు.

  • Loading...

More Telugu News