: ఆ షూటింగులో అమీర్ ఖాన్ ను హాకీ స్టిక్ తో తరిమేశాను: మాధురీ దీక్షిత్


బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ను హాకీ స్టిక్ తో తరిమానని ‘దిల్’ సినిమా నాటి జ్ఞాపకాలను నాటి హీరోయిన్ మాధురీ దీక్షిత్ గుర్తుచేసుకుంది. 1990 ల్లో వచ్చిన దిల్ చిత్రంలో అమీర్ సరసన మాధురీ దీక్షిత్ నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్రం షూటింగ్ లో చోటుచేసుకున్న సరదా సంఘటనను ఆమె గుర్తుచేసుకుంది. ‘షూటింగ్ సయమంలో అమీర్ ఖాన్ తనను ఆటపట్టించడంతో హాకీ స్టిక్ తీసుకుని వెంబడించాను. నా జీవితంలో చేసిన అత్యంత సరదా పని ఇదే’ అని మాధురీ దీక్షిత్ పేర్కొంది. బాగా నటించేవారిని చూసి ప్రేరణ పొందుతానని ట్విట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో భాగంగా అడిగిన ఒక ప్రశ్నకు అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్ సమాధానమిచ్చింది.

  • Loading...

More Telugu News