: థాయ్ లాండ్ టైగర్ టెంపుల్ లో పులిపిల్లల కళేబరాలు


థాయ్ లాండ్ లోని టైగర్ టెంపుల్ లో సుమారు 40 పులి పిల్లల కళేబరాలు ఈరోజు బయటపడ్డాయి. వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో వన్యప్రాణ సంరక్షణ అధికారులు దాడి చేయడంతో ఈ విషయం బయటపడింది. టైగర్ టెంపుల్ లోని కిచెన్ లో ఉన్న ఫ్రిజ్ లో పులి పిల్లల కళేబరాలను గుర్తించామని నేషనల్ పార్క్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అదిసోర్న్ నుచదమ్ రాంగ్ పేర్కొన్నారు. వన్యప్రాణుల అక్రమరవాణా జరుగుతోందనే ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న కొన్ని పులులను వేరే చోటుకు తరలించామని చెప్పారు. ఈ సందర్భంగా ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ, టైగర్ టెంపుల్ పులులకు నరకంగా మారిందని, తమ దేశం నుంచి విదేశాల నుంచి ఇక్కడికి సందర్శన నిమిత్తం వచ్చే పర్యాటకులను రావద్దని వారు కోరారు. కాగా, అటవీ ఉత్పత్తులు, వన్యప్రాణుల అక్రమరవాణాకు థాయ్ లాండ్ కేంద్రంగా ఉంది. చైనా సాంప్రదాయక వైద్యంలో పులుల శరీర భాగాలను విరివిగా వాడుతుంటారు. దీంతో పులుల శరీర భాగాల అక్రమరవాణా ఎక్కువగా జరుగుతుంటుంది.

  • Loading...

More Telugu News