: మంత్రి పుల్లారావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా 2014లో నిర్వహించిన రైల్ రోకో కేసులో పుల్లారావుతో పాటు ఎమ్మెల్యే ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, లింగంశెట్టి ఈశ్వరరావు, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసును విచారించిన రైల్వే న్యాయస్థానం కోర్టు వాయిదాలకు హాజరుకాని కారణంతో వీరందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.