: సెటిల్మెంట్లు, వివాదాల జోలికి వెళ్లే ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తప్పవు: ఎంపీ క‌విత


తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌ర‌చిన త‌మ పార్టీ బంగారు తెలంగాణ దిశ‌గా అడుగులేస్తోంద‌ని రాష్ట్రం ఏర్ప‌డి రెండేళ్లు గ‌డుస్తోన్న సంద‌ర్భంగా ఓ టీవీ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టీఆర్ఎస్‌ ఎంపీ క‌విత అన్నారు. మిష‌న్ కాక‌తీయ వంటి కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల కోస‌మేన‌ని దానిపై విమ‌ర్శ‌లు వ‌ద్ద‌ని సూచించారు. పాల‌న‌లో త‌మ ప్ర‌భుత్వం సంస్క‌రణ‌లు తెచ్చే ప్ర‌యత్నం చేస్తోంద‌ని చెప్పారు. సెటిల్మెంట్లు, వివాదాల జోలికి వెళ్లే ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆమె హెచ్చ‌రించారు. రానున్న కాలంలో త‌మ ప్ర‌భుత్వం మ‌రిన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంద‌ని క‌విత చెప్పారు. అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News