: భూమన, చెవిరెడ్డిపై ‘సమైక్య’ కేసు కొట్టివేత!


వైసీపీలో కీలక నేతలు... తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు నెల్లూరులోని రైల్వే కోర్టులో ఊరట లభించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గతంలో తిరుపతి రైల్వే స్టేషన్ లోకి 500 మంది కార్యకర్తలతో ప్రవేశించిన భూమన, చెవిరెడ్డి రైల్ రోకోకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను చేపట్టిన రైల్వే కోర్టు ముందు పోలీసులు సాక్ష్యాలను చూపలేకపోయారు. దీంతో ఈ కేసులో నిందితులపై నేరం రుజువు కాలేదని, ఈ కారణంగానే కేసును కొట్టివేస్తున్నామని న్యాయమూర్తి అరుణశ్రీ నిన్న తీర్పు చెప్పారు.

  • Loading...

More Telugu News