: సురేష్ ప్రభుకు టికెట్ ఇవ్వాలని మేం అడగలేదు: పురంధేశ్వరి సంచలన వ్యాఖ్య
రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటును ఏపీ కోటాలో ఇవ్వాలని తామేమీ కోరలేదని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సీటు కావాలని తాము కోరామా? లేదా? ఆఫర్ టీడీపీ నుంచే వచ్చిందా? అన్న విషయాలని తెలుగుదేశం వారినే అడిగి తెలుసుకోవాలని పురంధేశ్వరి చెప్పారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, అమిత్ షా కోరిన కారణంగానే సురేష్ ప్రభుకు టికెట్ ఇచ్చామని టీడీపీ ప్రచారం చేసుకోవడాన్ని ఖండించారు. ఏదీఏమైనా రైల్వే మంత్రి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. ఈ నెల 4 నుంచి రాష్ట్రంలో కేంద్రమంత్రులు పర్యటించనున్నారని, పార్టీ బలోపేతానికి ఈ పర్యటనలు దోహదపడతాయని అన్నారు.