: ఏం ముఖం పెట్టుకుని జగన్ ‘అనంత’ పర్యటన చేస్తున్నారు?: మంత్రి పల్లె రఘునాథ రెడ్డి
నేటి నుంచి అనంతపురంలోని తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో రైతు భరోసా యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఆయనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీపై జగన్ పలు రకాల వ్యాఖ్యలు చేశారని, దీనికి అమెరికా అంత బడ్జెట్ అవసరమవుతుందని అన్నారని పల్లె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వైసీపీ అధినేత అనంతలో పర్యటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే జగన్ రైతుల కోసం అంటూ భరోసా యాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘తమ పార్టీని కాపాడుకోవడానికే జగన్ యాత్రలు చేస్తున్నారు కానీ, రైతుల కోసం కాద’ని ఆయన ఆరోపించారు.