: కారెక్కిన టీ టీడీపీ ఎంపీ!... అభివృద్ధి కోసమే పార్టీ మారానన్న మల్లారెడ్డి!
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ కార్పొరేటర్ మినహా ఒక్క ప్రజా ప్రతినిధి కూడా మిగల్లేదు. మొన్నటి ఎన్నికల్లో వీచిన తెలంగాణ గాలికి ఎదురు నిలిచి టీడీపీ టికెట్ పై మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన మల్లారెడ్డి కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. టీఆర్ఎస్ ను గాని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను గానీ తానెప్పుడూ విమర్శించలేదని మల్లారెడ్డి పేర్కొన్నారు.