: కన్యత్వ పరీక్షలో విఫలమైందని, పెళ్లయిన 48 గంటలకే విడాకులిచ్చిన నాసిక్ వాసి


కట్టుకున్న భార్య శీలవతా? కాదా? అన్న అనుమానం తలెత్తగా, ఓ కొత్త పెళ్లి కొడుకు, భార్య కన్య కాదని తేలిందని చెబుతూ, పెళ్లయిన రెండో రోజే విడాకులు ఇచ్చాడు. నాసిక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. విడాకులు ఇచ్చేందుకు స్థానిక కుల పంచాయితీ అంగీకరించడం, మహారాష్ట్రలో చట్టాల అమలుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. వివాహమైన తరువాత తొలి రాత్రి నాడు, ఓ తెల్లటి బెడ్ షీట్ ను మంచంపై పరవాలని, దాన్ని తెల్లారి పొద్దున్నే తమకు చూపాలని కుల పంచాయితీ ముందే తేల్చి చెప్పగా, బెడ్ షీట్ పై రక్తపు మరకలు లేని కారణంగా, ఆమె కన్య కాదని తేల్చిన పెద్దలు జంటను విడగొట్టేందుకు నిర్ణయించారు. ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆ యువతి పోలీసు విభాగంలో చేరేందుకు శిక్షణ తీసుకుంటోందని, రన్నింగ్, లాంగ్ జంప్, సైక్లింగ్ వంటి వ్యాయామాలను నిత్యమూ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, సమస్యను పరిష్కరించి, ఈ ఆధునిక కాలంలో అటువంటి నమ్మకాలు వద్దని వరుడికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News