: వరుసగా కూర్చుని... దప్పిక తీర్చుకున్న సింహాలు... అరుదైన వీడియో!
ఒక్క సింహాన్ని చూస్తేనే కళ్లు జిగేల్ మంటాయి. వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఒకేసారి 9 సింహాలు కనిపిస్తే... అదీ మనకంటే కూడా క్రమశిక్షణతో కనిపిస్తే... అరుదైన దృశ్యమేగా. అలాంటి దృశ్యమే గుజరాత్ లోని గిర్ జాతీయ పార్కులో కనిపించింది. భానుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోయిన 9 సింహాలు అక్కడి ఓ నీటి కుంట వద్దకు చేరుకున్నాయి. క్రమశిక్షణలో తమకు తామే సాటి అన్నట్లు ఆ 9 సింహాలు చక్కగా నీటి కుంట అంచు వద్ద వరుసగా కూర్చున్నాయి. కూడబలుక్కున్నట్లు అన్నీ ఒకేసారి నీటిని తాగాయి. ఈ అరుదైన దృశ్యాన్ని ఓ వీడియోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
#WATCH: Visuals of Asiatic lions at a watering hole in Gujarat's Gir National Park.https://t.co/UNQTNfwiHK
— ANI (@ANI_news) 1 June 2016