: మలుపు తిరిగిన ఝాన్సీ ఆత్మహత్య కేసు!... పురుగుల మందు తాగించి తల్లి, భర్తే హత్య చేశారట!
కన్న తల్లి, కట్టుకున్న భర్త వ్యభిచారం చేయమంటున్నారన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములకు చెందిన వివాహిత ఝాన్సీ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీ, న్యాయమూర్తికి లేఖలు రాసినా స్పందన లేకపోవడంతోనే ఇంజినీరింగ్ చదువుతున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకుందన్న వార్త మొన్న తెలంగాణవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు... ఝాన్సీ తల్లి, భర్తతో పాటు స్నేహితులను పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ ఆత్మహత్య చేసుకోలేదని... ఆమె తల్లి, భర్తలే ఆమె చేత పురుగుల మందును బలవంతంగా తాగించి హత్య చేశారని తేలింది. దీంతో ఝాన్సీ తల్లి, భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.