: ముస్లిం యువతపై పెరుగుతున్న తప్పుడు ఉగ్ర ఆరోపణలతో ఆందోళన: కేంద్ర మంత్రి సదానంద గౌడ


దేశవ్యాప్తంగా ముస్లిం యువతపై తప్పుడు కేసులు పెరుగుతున్నాయని, వారిపై ఆధారాలు లేని ఉగ్రవాద ఆరోపణలు నమోదవుతుండటం ఆందోళనాకరమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించారు. దేశంలో న్యాయ వ్యవస్థకు సంస్కరణలు తీసుకువస్తేనే ఈ పరిస్థితి తొలగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిం యువత విషయంలో పరిస్థితి మార్చాలని భావిస్తున్నామని, ఇందుకోసం న్యాయ కమిషన్ కొన్ని ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందించనుందని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చైర్మన్ గా ఉండే కమిటీ నివేదికను తయారు చేస్తుందని, ఉగ్రవాద ఆరోపణలపై తీసుకోవాల్సిన చర్యలు, బెయిల్, విచారణ తదితర అంశాల్లో తీసుకురావాల్సిన మార్పులపై నివేదిక ఉంటుందని సదానంద గౌడ వివరించారు.

  • Loading...

More Telugu News