: ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ముస్తాబు!... విద్యుద్దీపాలతో వెలిగిపోతున్న హైదరాబాదు!


తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు కేసీఆర్ సర్కారు సన్నాహాలు పూర్తి చేసింది. రేపు జరగనున్న ఈ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. రాజధాని హైదరాబాదు నగరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించిన అధికారులు నగరానికి కొత్త శోభను తెచ్చారు. ఇక రాష్ట్రంలోని వరంగల్ సహా మిగిలిన అన్ని జిల్లా కేంద్రాలు కూడా వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ నృత్య రీతులు హోరెత్తనున్నాయి.

  • Loading...

More Telugu News