: జెనీలియా దంపతులకు మరో మగబిడ్డ!


'బొమ్మ‌రిల్లు' సినిమాలో ‘హాసిని’ అంటూ అల్ల‌రి అమ్మాయి పాత్ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల్ని చేసిన జెనీలియా ఈరోజు ఉద‌యం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని ఆమె భ‌ర్త, న‌టుడు రితీష్ దేశ్‌ముఖ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా త‌న మొద‌టి కుమారుడి మాట‌ల రూపంలో తెలిపాడు. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దంప‌తుల‌కి ఇప్ప‌టికే రెండేళ్ల కుమారుడు ‘రియాన్’ ఉన్న సంగ‌తి తెలిసిందే. రితీష్ దేశ్‌ముఖ్ ట్విట్ట‌ర్‌లో త‌న కుమారుడు రియాన్ ఫోటోని పోస్ట్ చేసి, త‌న కొడుకు చెబుతున్న‌ట్లుగా ‘హాయ్ గాయ్స్, మా అమ్మా, నాన్న కొద్ది సేప‌టి క్రితం నాకు చిన్నారి తమ్ముడ్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక నేను ఆడుకునే బొమ్మ‌లన్నీ వాడివే’ అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News