: 20 రోజులు నిలిచే బ్యాటరీ, 5.5 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్ తో 'యూ యునీకార్న్'... 7న ఫ్లాష్ సేల్
మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యూ టెలీవెంచర్స్ మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్ తో వచ్చింది. ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే లభించే ఈ ఫోన్ కు రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. 'యూ యునీకార్న్' పేరిట విడుదల కానున్న ఫోన్ ప్రారంభ ఆఫర్ ధర రూ. 12,999 కాగా, నెల రోజుల తరువాత రూ. 14,999కి బహిరంగ మార్కెట్లోకి విడుదల కానుంది. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని సంస్థ ప్రకటించింది. ఇక ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, ముందుగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ గురించి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో వాడగా, 20 గంటల టాక్ టైమ్, 500 గంటల స్టాండ్ బై (దాదాపు మూడు వారాలు) టైం ఇందులో లభించనుంది. 13/5 ఎంపీ కెమెరాలు, 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ, 4చీ, ఐదు వేలిముద్రలను దాచుకునే అవకాశం, 32 జీబీ అంతర్గత మెమొరీ, ఆక్టాకోర్ ప్రాసెసర్, మైక్రో, హైబ్రిడ్ సిమ్ లను వాడుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ 7వ తేదీన ఉంటుందని సంస్థ పేర్కొంది.