: స్టెప్పులతో దుమ్మురేపిన హిమాచల్ సీఎం వీరభద్రుడు!


హిమాచల్ ప్రదేశ్ కు ఆరోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీరభద్ర సింగ్ ను ప్రస్తుతం అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆయన అరెస్ట్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలోనూ వీరభద్ర సింగ్ సరదా సరదాగా గడిపేస్తున్నారు. నిన్న సిమ్లాలో ఇందిరాగాంధీ వైద్య కళాశాలలో జరిగిన వార్షిక బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన హాజరయ్యారు. బహుమతుల ప్రదానం అనంతరం ఆయన వేదికపైనే విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఓ వైపు కేసులు, మరోవైపు వృద్ధాప్యం వేధిస్తున్నా... వీరభద్ర సింగ్ ఈజీగా స్టెప్పులేసి అక్కడి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News