: చిరు, నాగ్, సచిన్ కలిసిన వేళ!


తన 150వ చిత్రం కోసం బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లు ఈ ఉదయం తిరుమలలో కలిశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వీరంతా, ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనానికి ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. గత రాత్రి వీరు తిరుమలకు రాగా, అధికారులు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. ఉదయం దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించారు. వీరితో పాటు నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు కూడా ఉన్నారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న వేళ మీడియా కోరిక మేరకు సెలబ్రిటీలంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

  • Loading...

More Telugu News