: అంతా అశోక్ రెడ్డి వెంటే!... గిద్దలూరులో వైసీపీ కనుమరుగు!


ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఇక వైసీపీ పేరు వినిపించదు. ఎందుకంటే ఆ పార్టీ తరఫున నియోజకవర్గంలో విజయం సాధించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి వెంట టీడీపీలో చేరుతున్నారు. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సాగు నీటి సంఘాల అధ్యక్షులు తదితరులంతా అశోక్ రెడ్డి వెంటే నడిచేందుకు రంగం సిద్ధమైపోయింది. నేటి ఉదయం విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో అశోక్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే విజయవాడ చేరిన అశోక్ రెడ్డి వెంట స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా తరలివెళ్లారు.

  • Loading...

More Telugu News