: టీడీపీ అభ్యర్థులు పసిడి కొండలు!... సింగిల్ కేసూ లేని సుజనా, టీజీ వెంకటేశ్!


రాజ్యసభ బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లు నిజంగా 'బంగారు' కొండలే. ఎందుకంటే, వారి ఆస్తుల్లో కోట్లాది రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి. రాజ్యసభ సభ్యత్వం కోసం నిన్న నామినేషన్లు దాఖలు చేసిన వారిద్దరూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఈ అఫిడవిట్లలో వారి ఆస్తులకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి తన ఆస్తులను రూ.53 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.47 కోట్ల విలువ చేసే చరాస్తులను ప్రకటించిన సుజనా, రూ. 6.95 కోట్ల మేర స్థిరాస్తులను వెల్లడించారు. మొత్తంగా తన ఆస్తులను రూ.53.95 కోట్లుగా సుజనా ప్రకటించారు. తనకు, తన భార్యకు కలిపి మొత్తం రూ.5.08 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలున్నట్లు సుజనా పేర్కొన్నారు. ఇక టీజీ వెంకటేశ్ విషయానికొస్తే... మొత్తం రూ.29.68 కోట్ల మేర ఆస్తులున్నట్లు ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన పేరిట రూ.12.18 కోట్లు, తన భార్య పేరిట రూ.17.13 కోట్ల ఆస్తులున్నాయని ఆయన ప్రకటించారు. ఈ ఆస్తుల్లో రూ.1.71 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలున్నట్లు టీజీవీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వీరిద్దిరిపై సింగిల్ కేసు కూడా లేదు. ఈ మేరకు తాము క్లీన్ చిట్ కలిగిన వ్యక్తులమేనంటూ అఫిడవిట్ లో సుజనా, టీజీవీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News