: వైరల్ గా మారిన జూనియర్ మాల్యా వీడియో!... ఇప్పటకే లక్షన్నర దాటిన హిట్లు!


ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూశామంటూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది. మాల్యా సంస్థలు ప్రమోట్ చేసిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్, హైదరాబాదు సన్ రైజర్స్ జట్ల మధ్య మొన్న బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ ను సిద్ధార్థ మాల్యా... తన తండ్రి, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి లండన్ లోని తమ ఇంటిలో బిగ్ స్క్రీన్ పై వీక్షించారు. ఆ సందర్భంగా తీసుకున్న సెల్పీ వీడియోను జూనియర్ మాల్యా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. సదరు వీడియోలో సిద్ధార్థ చలాకీగా కనిపించగా, విజయ్ మాల్యా కూడా మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే ఈ వీడియోను లక్షన్నర మంది నెటిజన్లు వీక్షించారు.

  • Loading...

More Telugu News