: రాహుల్ గాంధీని అనుసరించిన అమిత్ షా!


రాహుల్ గాంధీని అమిత్ షా అనుసరించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడైన రాహుల్ గాంధీ భేషజాలను పక్కనపెట్టి పలు సందర్భాల్లో దళితలు ఇళ్లలో భోజనం చేసి, 'అంతా ఒక్కటే' అని నిరూపించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారి ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు. యూపీలోని శైవపురి నియోజకవర్గంలో జోగియాపూర్ లో రైతు సదస్సులో పాల్గొన్న అమిత్ షా, గిరిప్రసాద్ బింద్, ఇక్బాల్ బింద్ అనే దళితుల ఇంట నేలపై కూర్చుని భోజనం చేశారని, వారు ఆయనకు ఆప్యాయంగా వడ్డించారని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ సంజయ్ భరద్వాజ్ తెలిపారు. దీనిపై యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. వచ్చేఏడాది యూపీలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికారకాంక్షతో గతంలో చేయని పనులను బీజేపీ నేతలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News