: ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు ఆకర్షణీయ నగరాలు కాదంటున్న కేంద్రం
మెట్రో నగరాలుగా కీర్తి గడించిన ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరులు ఏమాత్రం ఆకర్షణీయమైన నగరాలు కావని కేంద్రం పేర్కొంది. సిటీస్ ఆఫ్ మోషన్ ఇండెక్స్ (సీఐఎంఐ), ఐఈఎస్ఈ బిజినెస్ స్కూల్, సెంటర్ ఫర్ గ్లోబలైజేషన్ అండ్ స్ట్రాటజీతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం 181 నగరాల జాబితాలో దేశ ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న ముంబై 167వ స్థానంలో నిలిచింది. ఇక దేశరాజధాని ఢిల్లీ 174వ స్థానంలో నిలిచింది. ఆహ్లాదకరమైన నగరంగా, అందమైన సిటీగా పేరొందిన బెంగళూరు 176వ స్థానంలో నిలిస్తే, దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరమైన కోల్ కతా 179వ స్థానంలో నిలిచింది. ఈ సర్వేలో ఆర్థిక, జనావాస, సాంకేతిక, పర్యావరణ, ఇంటర్నేషనల్ ఔట్ రీచ్, గవర్నెన్స్, గ్రామీణాభివృద్ధి, ప్రజా, రవాణా నిర్వహణను పరిగణనలోకి తీసుకున్నట్టు ఈ సంస్థలు తెలిపాయి.