: మీడియాలో కనపడేందుకే ముద్రగడ వెంపర్లాట!: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
మీడియాలో కనపడాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెంపర్లాడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. కాపులను చీల్చుతున్నది ముద్రగడేనని ఆరోపించారు. కాపులకు సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయోజనాలను ముద్రగడ తన ఖాతాలో వేసుకోవాలని యత్నిస్తున్నారని అన్నారు. కాపుల రిజర్వేషన్ నిమిత్తమే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీపై కూడా చినరాజప్ప మండిపడ్డారు. ఒక దొంగోడికి రాజ్యసభ సీటు ఇచ్చిన వైఎస్సార్సీపీకి తమ పార్టీని, తమ నేతలను విమర్శించే నైతిక హక్కులేదన్నారు.