: రేపు ఉదయం టీఆర్ఎస్ లో చేరుతున్నాను: టీటీడీపీ ఎంపీ మల్లారెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రేపు ఉదయం కలిసి టీఆర్ఎస్ లో చేరుతున్నానని మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి ఈరోజు పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేసీఆర్ ను కలవనున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని ఈ సందర్భంగా మల్లారెడ్డి పేర్కొన్నారు. కాగా, మల్లారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారనే విషయమై నిన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News