: ఎందుకింత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు?: నెటిజన్లను ప్రశ్నించిన సోనమ్ కపూర్
దేశం మొత్తం కమెడియన్ తన్మయ్ భట్ వీడియోపై మండిపడుతుంటే బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మాత్రం అతనికి చురకలు అంటిస్తూనే వెనకేసుకొచ్చింది. సచిన్, లతామంగేష్కర్ ల గొంతుతో కామెడీ చేయాలని భావించిన తన్మయ్ భట్, అభాసుపాలయ్యాడు. దీంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై సోనమ్ కపూర్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించింది. లివింగ్ లెజెండ్స్ అయిన సచిన్, లతా మంగేష్కర్ పై వీడియో చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. అందరికీ నవ్వు తెప్పించే ప్రయత్నం చేయాలని, నవ్వులపాలయ్యే ప్రయత్నం మంచిది కాదని తెలిపింది. స్నేహితురాలిగా తన్మయ్ కు తాను మద్దతు పలుకుతానని తెలిపింది. ఇదే సమయంలో ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారని నెటిజన్లపై మండిపడింది.