: ఫొటోలకు పోజులివ్వనంటున్న శ్రీదేవి తనయ!


అందాల నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ ల ముద్దుల తనయ జాహ్నవి ఫొటోలకు పోజులిచ్చేందుకు తిరస్కరిస్తోంది. ఇటీవల జరిగిన ఓ సంఘటననే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో నటనలో శిక్షణ తీసుకుంటున్న జాహ్నవి వెకేషన్ నిమిత్తం ఇండియాకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఒక ఫొటో గ్రాఫర్ జాహ్నవిని ఫొటో తీసే ప్రయత్నం చేయగా, అందుకు ఆమె నిరాకరించిందట. ఫొటోగ్రాఫర్లు తనను ఫొటోలు తీయకుండా రక్షణ కవచంలా నిలబడాలని కూడా తన బాడీ గార్డ్స్ కు ఆమె చెప్పిందట. కొన్ని సందర్భాల్లో జాహ్నవిని ఫొటోలు తీయడానికి వచ్చిన వారి కెమెరాలను మర్యాదపూర్వకంగానే వారి వద్ద నుంచి తీసేసుకుని, జాహ్నవి కారు ఎక్కిన తర్వాత ఆమె బాడీగార్డులు తిరిగి వాటిని ఇచ్చేస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News