: మా నాన్నతో కలిసి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూశాను: విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ
భారత్ లో బ్యాంకులకు కోట్లాది రూపాయలు బకాయిపడి లండన్ చెక్కేసిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, తన కుమారుడు సిద్ధార్థతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు నిదర్శనం సామాజిక మాధ్యమాల్లో జూనియర్ మాల్యా పోస్ట్ చేసిన ఒక వీడియోనే. గత ఆదివారం నాడు జరిగిన ఐపీఎల్-9 ఫైనల్ మ్యాచ్ ను లండన్ లో బిగ్ స్క్రీన్ పై చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో దృశ్యాలను సిద్ధార్థ పోస్ట్ చేశాడు. ‘ఇక్కడ, మేమిద్దరం కలిసి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాము’ అని ఆ వీడియోలో సిద్ధార్థ పేర్కొన్నాడు. తనయుడు తన తండ్రిని కెమేరాతో షూట్ చేస్తుండగా... ‘గో ఆర్సీబీ’ అంటూ విజయ్ మాల్యా అనడం గమనార్హం.