: ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్ గా హ్యాట్రిక్ సాధించిన చంద్రశేఖర్ రావు... 25 లక్షల బహుమానం
ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్ గా వైఎల్ చంద్రశేఖరరావు హ్యాట్రిక్ సాధించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) క్యూరేటర్ అయిన ఆయన ఐపీఎల్ లో వరుసగా మూడోసారి ఈ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. మెదక్ జిల్లాకు చెందిన ఆయనకు ఈ సందర్భంగా రూ.25 లక్షల పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గతంలో రెండు సార్లు బెస్ట్ క్యూరేటర్ గా నిలిచిన ఆయన వరుసగా రూ.12 లక్షలు, రూ.9 లక్షలను బహుమతిగా పొందారు. కాగా, పిచ్ ల తయారీలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన చంద్రశేఖర్ రావు బెస్ట్ క్యూరేటర్ గా హ్యాట్రిక్ సాధించడంపై సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.