: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్షం
భానుడి ప్రతాపంతో మండిపోతోన్న హైదరాబాద్‌లో ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అమీర్ పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ సహా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ ఏర్పడింది.