: భారత్ లో ఇంకా బానిస బతుకులే!: సంచలన నివేదిక
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడుస్తున్నప్పటికీ ఇండియాలో బానిసత్వం మాత్రం పోలేదని ఆస్ట్రేలియాకు చెందిన హ్యూమన్ రైట్స్ గ్రూప్ వాక్ ఫ్రీ ఫౌండేషన్...'థర్డ్ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్' పేరిట నిర్వహించిన సర్వే వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 46 మిలియన్ల మంది ప్రజలు ఇంకా బానిసలుగా బతుకులీడుస్తున్నారని ఈ సర్వే నివేదిక పేర్కొంది. కేవలం భారత దేశంలోనే 18.4 మిలియన్ల మంది ప్రజలు ఇంకా బానిసలుగా బతుకుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. బానిసలకు జన్మించిన వారి పిల్లలను కూడా బానిసలు లేదా సెక్స్ వర్కర్లు, అదీ కాకపోతే కూలీలుగా వాడుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది. 2014లో ప్రపంచ వ్యాప్తంగా 35.8 మిలియన్ల మంది బానిసలుగా బతుకుతున్నారని నివేదిక పేర్కొనగా, వారి సంఖ్య 2016 నాటికి 46 మిలియన్లకు చేరిందని తేలింది. ప్రపంచంలోనే అత్యధిక బానిసలు గల దేశంగా ఉత్తరకొరియా నిలిచిందని ఈ నివేదిక వెల్లడించింది.