: నా భార్య బ్యాగులతో దాడి చేసేది: హీరో ఇమ్రాన్ హష్మీ
వెండి తెరపై ముద్దు సన్నివేశాలనగానే అబ్దరికీ గుర్తుకు వచ్చే హీరో ఇమ్మాన్ హష్మీ. బ్రహ్మచారిగా ఉన్నంత వరకూ ఎటువంటి ముద్దు సన్నివేశాల్లో నటించినా అడిగే వారుండరు. కానీ, పెళ్లయిన తర్వాత ఇటువంటి సన్నివేశాల్లో నటిస్తే మాత్రం భార్యతో తిప్పలు తప్పవని ఇమ్రాన్ హష్మీ అంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ముద్దు సన్నివేశాల్లో నటించానని నా భార్యకు తెలిసినప్పుడు గతంలో బ్యాగులతో నాపై దాడి చేసేది. ఇప్పుడు మాత్రం నేరుగా చేత్తోనే కొడుతోంది. నా భార్యను శాంతింపజేసేందుకు రకరకాలుగా ప్రయత్నించేవాడిని. ఆయా సన్నివేశాల్లో ఎన్ని ముద్దులు పెడితే అన్ని బ్యాగులు, ఖరీదైన ఆభరణాలు కొని ఇచ్చేవాడిని’ అంటూ ఇమ్రాన్ హష్మీ నవ్వుతూ చెప్పుకొచ్చాడు .