: తన్మయ్ భట్ పై విరుచుకుపడ్డ సల్మాన్ ఖాన్ తండ్రి
ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్ పై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, సీనియర్ రచయిత సలీమ్ ఖాన్ విరుచుకుపడ్డారు. గానకోకిల లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ల ముఖాలతో వీడియో మార్ఫింగ్ చేసిన తన్మయ్ భట్ పై ఆయన మండిపడ్డారు. ఇటువంటి హాస్యాన్ని అంగీకరించకూడదని అన్నారు. ఆంగ్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలియవు. కానీ, నేను విన్నంత వరకు, తన్మయ్ భట్ వీడియో అసహ్యం పుట్టించేలా ఉంది.ఇటువంటి వీడియోలను పూర్తిగా నిరుత్సాహపరచాలి. ఇటువంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తులు తప్పకుండా వారి బ్రెయిన్లు టెస్ట్ చేయించుకోవాలి లేదా పిచ్చాసుపత్రిలో ఉండాలి. ఇదో చౌకబారు వీడియో. ఈ వీడియో అందరినీ అలరించేలా హాస్యపూరితంగా కనుక ఉంటే, దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు’ అని సలీమ్ ఖాన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.