: ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ జరిమానా కట్టాల్సిందే: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు
ప్రపంచ శాంతిని కోరుతూ ఢిల్లీ వేదికగా యమునా నదీ తీరాన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ ఏడాది మార్చిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్సవాలతో అక్కడి పరిసరాల్లో కాలుష్యానికి కారణమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ జరిమానా కట్టాల్సిందేనని గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పింది. రూ.5కోట్లు జరిమానా కట్టాలని తాము చేసిన హెచ్చరికలపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఉత్సవాల సందర్భంగా స్పందిస్తూ ఫైన్ కడతామని చెప్పిందని, అయితే ఇప్పుడు మాట మార్చేస్తోందని గ్రీన్ ట్రైబ్యునల్ పేర్కొంది. ఇప్పటి వరకు తమకు సదరు సంస్థ జరిమానా చెల్లించలేదని తెలిపింది. తమపై విధించిన జరిమానాను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చెల్లించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతోందని గ్రీన్ ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది.