: పోలీసులే విస్తుపోయేలా హత్య చేసిన ప్రియుడు!


తన నుంచి విడిపోయిందన్న కక్షతో ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. ఇటలీ రాజధాని రోమ్ యూనివర్సిటీ విద్యార్థిని సారా డీపీట్రంటోనియో (22), విన్కెంజో పడానో (27) తో ప్రేమలో పడింది. తరువాత అతని ప్రవర్తనతో విసిగిపోయి విడిపోయింది. దీనిపై పగ పెంచుకున్న పడానో ఆమె ఒంటరిగా కారులో వెళ్తున్నప్పుడు అడ్డగించాడు. ఆమె కారులో ఉండగానే కారుకు నిప్పుపెట్టాడు. తర్వాత కారులోంచి దిగి తప్పించుకుని పారిపోతున్న ఆమె వెంటపడి, ఆమె ముఖం, శరీరంపై ఆల్కహాల్ పోసి లైటర్ తో నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసుల దర్యాప్తులో తనకేం తెలియదని బుకాయించిన పాడానో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆధారాలను చూపించి అడిగేసరికి నిజం ఒప్పుకున్నాడు. తరువాత జరిగిన తతంగం మొత్తం వివరించాడు. దీనిని విన్న విచారణాధికారి, తన సుదీర్ఘ కెరీర్ లో ఇంత క్రూరమైన హత్యను చూడలేదని ఆవేదన వెలిబుచ్చాడంటే...హత్య ఎంత దారుణంగా చేశాడో ఊహించవచ్చు.

  • Loading...

More Telugu News