: రక్తమార్పిడి వల్ల 2234 మందికి హెచ్ఐవీ
ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. రక్తదానం, అవయవదానం చేసేందుకు విద్యావంతులు ముందుకు వస్తున్నారు. అయితే, పరీక్షలు నిర్వహించి రక్తాన్ని స్వీకరించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం పలువురికి ప్రాణసంకటంగా మారుతోంది. 2014 అక్టోబర్ నుంచి 2016 మార్చి వరకు స్వీకరించిన రక్తం కారణంగా 2,234 మందికి హెచ్ఐవీ సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. చాలావరకు బ్లడ్ బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని సమాచారహక్కు చట్టం ద్వారా చేతన్ కొఠారీ సేకరించిన వివరాల ద్వారా వెల్లడైంది. 2014 జనవరి నుంచి సుమారు 30 లక్షల యూనిట్ల బ్లడ్ ను బ్యాంకులు సేకరించగా, అందులో 84 శాతం మంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసినవారే కావడం విశేషం. ఈ బ్లడ్ సేకరణ సందర్భంగా రెండు వేలకుపైగా హెచ్ఐవీ బారిన పడగా, వారిలో అత్యధికులు యూపీ (361), గుజరాత్ (292) రాష్ట్రాల వారని గణాంకాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ సోకిన మూడు నెలల వరకు బయటపడదని, ఇలాంటి సమయంలోనే రక్తస్వీకర్తలకు ఇది సోకుతోందని గణాంకాలు చెబుతున్నాయి.