: అలిగిన పుష్పరాజ్ ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన తెలుగుదేశం నేతలు
రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి, ఆపై వేరొకరిని ఎంపిక చేయడం పట్ల, బహిరంగంగానే అసంతృప్తిని, విమర్శలను గుప్పించిన మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ ను బుజ్జగించేందుకు తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగారు. రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై అలిగిన ఆయన్ను ఓదార్చి పరిస్థితులను వివరించేందుకు రావెల కిశోర్ బాబు, యనమలను పంపినట్టు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్ అవసరాలను ఆలోచించిన మీదటే టీజీ, సుజనాలను ఎంపిక చేయాల్సి వచ్చిందని, టీడీపీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని వారు పుష్పరాజ్ కు వివరించినట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పదవులు ఇస్తున్నారని, టీడీపీలో నీతి, నిజాయతీలకు స్థానం లేదని పుష్పరాజ్ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.