: నా ఆల్ టైమ్ హీరో, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు: ప్రిన్స్ మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈరోజు 73వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కృష్ణ తన 'ఆల్ టైమ్ హీరో' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ‘ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కు వెరీ హ్యాపీ బర్త్ డే’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కృష్ణ ఫొటోను కూడా మహేష్ పోస్ట్ చేశాడు. కాగా, సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు సినీ ప్రముఖులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.