: తన్మయ్ భట్ మార్ఫింగ్ వీడియోపై స్పందించిన లతా మంగేష్కర్
‘భారతరత్న’లు లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ లను అవమానించేలా ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్ అనుకరణతో 'కామెడీ గ్రూప్ ఏఐబీ' రూపొందించిన వీడియో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై గాన కోకిల లతా మంగేష్కర్ స్పందించినట్లు ‘బాలీవుడ్ లైఫ్. కామ్’ కథనం. ‘నేను ఇంతవరకూ ఈ వీడియోను చూడలేదు. దీని గురించి కామెంట్ కూడా చేయను. మరో విషయం, అసలు తన్మయ్ భట్ ఎవరో నాకు తెలియదు’ అని లత పేర్కొన్నట్లు ఆ కథనంలో తెలిపింది. కాగా, ‘సచిన్ వర్సెస్ లతా సివిల్ వార్’ అని టైటిల్ పెట్టి, అందులో వారి గొంతును అనుకరిస్తూ ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్ ఈ వీడియోను రూపొందించారు. దీంతో, నెటిజన్లు, సచిన్, లతామంగేష్కర్ అభిమానులు పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.