: గండిపేట కాల్పుల కలకలం: తాగిన మైకంలోనే కాల్పులు
హైదరాబాద్ శివారులోని గండిపేటలో నిన్న రాత్రి కాల్పుల ఘటన చోటుచేసుకున్న సంగతి విదితమే. కాల్పుల కలకలంపై దర్యాప్తు జరిపిన పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. గోల్కొండ రిసార్ట్‌లో నిన్న రాత్రి ఓ ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్‌కు గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ప్రభాకర్ హాజరయ్యారు. వీరిరువురికి మధ్య ఉన్న ఆస్తి తగాదాలతో ప్రశాంత్‌ను బెదిరించేందుకు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే కాల్పులు జరిపిన సమయంలో ప్రభాకర్ తాగి ఉన్నాడని పోలీసులు చెప్పారు. దీనిపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.