: ప్రముఖ సినీనటుడు మోహన్ బాబును కలిసిన కాపు ఉద్యమనేత ముద్రగడ
గత రెండు రోజులుగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా ప్రముఖ సినీనటుడు మోహన్ బాబును కలిశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని జల్ పల్లి లోని ఫాంహౌస్ లో మోహన్ బాబును ఆయన కలిశారు. అయితే, ఏ అంశాలపై వీరు చర్చించారనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, కాపు కులస్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తమ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని ఏపీ సర్కార్ ను ముద్రగడ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో, ముద్రగడ తీరుపై ఏపీ మంత్రులు అసహనం వ్యక్తం చేయడమే కాకుండా, కాపు యువతను తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆయనను విమర్శించిన విషయం తెలిసిందే.