: మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ లకు సీబీఐ కోర్టు జైలు శిక్ష
బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ మంత్రి, కదిరి నియోజకవర్గ వైకాపా నేత మహమ్మద్ షాకీర్ కు సీబీఐ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసాద్, బ్యాంకు మేనేజర్ తో పాటు మొత్తం ఐదుగురికి ఇదే శిక్షను విధిస్తున్నట్టు తెలిపింది. కాగా, కదిరి స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా - వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు (ఎస్బీఐ-ఏడీబీ)లో జరిగిన మోసాలపై కేసు నమోదు కాగా, రైతులకు మంజూరైన పంటల బీమాను, ఇన్ పుట్ సబ్సిడీని వీరు స్వాహా చేసినట్టు ప్రధాన ఆరోపణ. బ్యాంకు అధికారుల సాయంతో బోగస్ ఖాతాలను తెరిచిన వీరు రూ. కోటికి పైగా డబ్బు కాజేసినట్టు గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొద్దిసేపటి క్రితం శిక్షలను ఖరారు చేసింది.